తెలిసి తెలియకుండా ఇంట్లో ఎన్నో వస్తువులు ఉంటాయి. అయితే వాటిలో ఉపయోగించని వస్తువులు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. వాటి వలన ఎంతో ప్రమాదం అని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఇంట్లో కుటుంబ సభ్యుల ఆరోగ్యం దెబ్బతిన్నప్పుడు మందులను తీసుకొచ్చి ఉపయోగిస్తూ ఉంటారు. అయితే ఈ విధంగా గడువు తీరిన మందులు కూడా ఎక్కువ అవుతాయి. ఎప్పుడైతే అల్మారాలో గడువు ముగిసిన మందులను ఉంచుతారు, వాటిలో రసాయన మార్పులు జరుగుతాయి. ఈ విధంగా అవి ఎంతో ప్రమాదకరంగా మారుతాయి అని నిపుణులు చెబుతున్నారు.
ముఖ్యంగా చిన్నపిల్లలు ఉండే ఇంట్లో అటువంటి మందులను అస్సలు ఉంచకూడదు. పైగా వాటిని ఉపయోగించడం వలన ఆరోగ్యానికి కూడా ప్రమాదకరం. అదేవిధంగా ఇంట్లో ప్లాస్టిక్ డబ్బాలను ఎక్కువగా ఉపయోగించకూడదు. ప్లాస్టిక్ డబ్బాల్లో వేడిగా ఉండే ఆహారాన్ని నిల్వ చేయడం వలన ఎన్నో రసాయనాలు విడుదలవుతాయి. దీనివల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ముఖ్యంగా హార్మోన్ల అసమతుల్యత మరియు ఇతర సమస్యలు ఎక్కువ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. కనుక వీలైనంత వరకు ప్లాస్టిక్ డబ్బాలను ఉపయోగించకపోవడమే మేలు.
ఇంట్లో ఉండే ఎలక్ట్రానిక్ వస్తువుల్లో రిమోట్ సెల్ కోసం బ్యాటరీలను అందరూ ఉపయోగిస్తూ ఉంటారు. అయితే కాలం చెల్లిన బ్యాటరీలను ఇంట్లో ఉంచడం కూడా ప్రమాదకరం. ఉపయోగించని బ్యాటరీలు ఇంట్లో ఉంటే, హానికరమైన రసాయనాలు విడుదల చేస్తాయి. దీనివల్ల ఆరోగ్యం దెబ్బతింటుంది. కొన్నిసార్లు ఇంట్లో మంటలు కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. చాలా శాతం మంది పాత దిండ్లు ను ఉపయోగిస్తూ ఉంటారు. ఒకే దిండును ఎక్కువ రోజులు ఉపయోగించడం వలన వాటిలో దుమ్ము పేరుకుంటుంది. అంతేకాకుండా పురుగులు, బ్యాక్టీరియా వంటివి కూడా చేరుతాయి. దీంతో ఆస్తమా, అలర్జీ వంటి సమస్యలు తలెత్తుతాయి అని నిపుణులు చెబుతున్నారు. కనుక ఒకటి లేదా రెండు సంవత్సరాలకు దిండ్లను మార్చుతూ ఉండాలి అని గమనించాలి.