తెలంగాణ వాసులకు బిగ్ అలర్ట్. తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాలలో వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు సూచనలు చేస్తున్నారు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాలలో మధ్యాహ్నం నుంచి విపరీతంగా వర్షం కురుస్తోంది. ఈరోజు సాయంత్రం 6:30 గంటల లోపు వర్షాలు పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్ర అధికారులు వెల్లడించారు.

మంచిర్యాల, ఆసిఫాబాద్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, భద్రాద్రి, వరంగల్, వికారాబాద్, హన్మకొండ, కామారెడ్డి జిల్లాలలో వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని హెచ్చరికలు జారీ చేశారు. గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటికి రాకూడదని హెచ్చరించారు.