ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాజకీయాలలో ఎప్పుడు ఫుల్ బిజీగా ఉంటారు. ఇక తనకు సమయం దొరికినప్పుడల్లా సినిమా షూటింగ్లలో పాల్గొంటారు. తన అభిమానుల కోసం సినిమాలకు కాస్త సమయాన్ని కేటాయిస్తూ ఉంటారు. కాగా ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నారు. ఈ సినిమా షూటింగ్ సెట్ లో పవన్ కళ్యాణ్ ఉన్నప్పుడు అదే సమయంలో అక్కడికి చిరంజీవి వెళ్లారు.
ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటో సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ గా మారింది. మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇద్దరికీ సంబంధించిన ఫోటో ఇప్పుడు సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతుండడంతో తన అభిమానులు సంతోషపడుతున్నారు. దీంతో అన్నతమ్ములు ఇద్దరినీ ఒకే ఫ్రేమ్ లో చూసిన అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు. కాగా, ఈ సినిమాకు హరీష్ శంకర్ దర్శకత్వం వహించగా… యంగ్ బ్యూటీ శ్రీ లీల హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తొందరలోనే ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ కాబోతున్నట్లుగా సమాచారం అందుతుంది. పవన్ కళ్యాణ్ సినిమా కోసం తన అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.