ఏపీ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. గిరిజన సంక్షేమ శాఖ గురుకులాల్లో పనిచేసే అవుట్ సోర్సింగ్ గెస్ట్ ఫ్యాకల్టీకి జీతాలు పెంచబోతున్నట్లుగా సమాచారం అందుతోంది. ఉపాధ్యాయుడికి రూ. 6వేల నుంచి రూ. 7వేల వరకు జీతాలు పెంచే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది.

గురుకుల, రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీల్లో పనిచేసే జూనియర్ లెక్చరర్లు, పీడీలు, లైబ్రేరియన్లకు సైతం రూ. 18 వేల నుంచి రూ. 24 వేల వరకు జీతాలు పెంచబోతున్నట్లుగా సమాచారం అందుతుంది. దీంతో గిరిజన గురుకులాల్లో పనిచేస్తున్న 16 వేల మందికి పైగా ఫ్యాకల్టీకి ప్రయోజనం చేకూరుతుంది. కూటమి ప్రభుత్వం ప్రభుత్వం తీసుకుంటున్న ఈ నిర్ణయానికి ఏపీ వాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.