Pattabhiram: తెలుగు రాష్ట్రాల్లో విషాదం నెలకొంది. ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు బీవీ పట్టాభిరామ్(75) కన్నుమూశారు. ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణుడు బీవీ పట్టాభిరామ్(75) గుండెపోటుతో మృతి చెందాడు. సోమవారం రాత్రి హైదరాబాద్‌లోని తన నివాసంలో ఆయన గుండెపోటుతో తుది శ్వాస విడిచారు.

పట్టాభిరామ్ ప్రముఖ ఇంద్రజాలికుడిగా, మానసిక వైద్యుడిగా, వ్యక్తిత్వ వికాస నిపుణుడిగా అందరికీ సుపరిచితులే. కాగా ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణుడు, మెజీషియన్ బీవీ పట్టాభిరామ్ గారి మృతి తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేశారు నారా లోకేష్. మెజీషియన్‌గా, హిప్నాటిస్టుగా, సాఫ్ట్ స్కిల్స్ ట్రైనర్‌గా బీవీ పట్టాభిరామ్ ఎనలేని సేవలు అందించారు. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానన్నారు.