చాణక్యుడు జీవితంలో ఎన్నో విషయాల గురించి వివరించాడు. అయితే చాణక్యుడు నీతి శాస్త్రంలో చెప్పిన నియమాలను పాటించడం వలన జీవన విధానం ఎంతో బాగుంటుంది. ముఖ్యంగా కుటుంబంలో స్త్రీలు ఉండే విధానం గురించి కూడా ఎన్నో విషయాలను చెప్పాడు. వాటిలో భాగంగా స్త్రీల లక్షణాలు గురించి వివరించడం జరిగింది. సహజంగా ఇంట్లో కుటుంబ సభ్యులు సంతోషంగా ఉండాలన్నా, కష్టాల్లో ఉండాలన్నా స్త్రీల పై ఆధారపడి ఉంటుంది అని చెప్పాడు. అయితే ఇటువంటి లక్షణాలు కలిగిన స్త్రీలు ఇంట్లో ఉంటే కుటుంబంలో కష్టాలు చాలా ఎక్కువగా ఉంటాయి.
ఎప్పుడైతే స్త్రీలు చిన్న విషయానికే ఎక్కువ కోపం తెచ్చుకుంటారో అటువంటి ఇంట్లో గొడవలు ఎక్కువగా జరుగుతాయి. దీని వలన లక్ష్మీదేవి కటాక్షాన్ని పొందలేరు. ఈ విధంగా కుటుంబంలో మనశ్శాంతి లేకుండా ఉంటుంది. అంతే కాకుండా ఎప్పుడైతే స్త్రీలు ఇతరుల గురించి చెడుగా మాట్లాడతారో, వారి ఇంటి గౌరవం దెబ్బతింటుంది. దీంతో కుటుంబంలో ఆనందం అస్సలు ఉండదు. అంతేకాకుండా ఎప్పుడైతే స్త్రీలు అందం మరియు డబ్బు గురించి గర్వపడతారో, వారికి గౌరవం తగ్గిపోతుంది. ముఖ్యంగా గర్వము ఉండే స్త్రీలకు సమాజంలో విలువ ఉండదు.
దీంతో చివరకు ఒంటరిగా మిగిలిపోవాల్సి వస్తుంది అని చాణిక్యుడు చెప్పడం జరిగింది.స్త్రీలు ఇతరులతో పోల్చుకోవడం సహజం, కాకపోతే ఇలా చేయడం వలన జీవితంలో తృప్తి ఉండదు. దీంతో ఎంతో బాధపడుతూ ఉంటారు. అంతే కాకుండా భర్త ఆదాయాన్ని తక్కువగా చూసే స్త్రీలు కూడా ఎంతో నష్టపోవాల్సి వస్తుంది. భర్త ఆదాయానికి సంబంధించి హేళన చేయడం వలన భర్త మనస్సు గాయపడుతుంది. దీంతో కుటుంబంలో ఎన్నో సమస్యలు తలెత్తుతాయి. అందువల్ల స్త్రీలలో ఈ లక్షణాలు ఉంటే, కుటుంబ సభ్యులు మధ్య ఎన్నో సమస్యలు తలెత్తుతాయి అని చాణక్యుడు చెప్పాడు.