వల్లభనేని వంశీకి షాక్ ఇచ్చింది ఏపీ ప్రభుత్వం. వల్లభనేని వంశీ రిలీజ్ కు బ్రేక్ పడేలా కనిపిస్తోంది. వల్లభనేని వంశీ బెయిల్ రద్దు చేయాలని సుప్రీంకోర్టును ఆశ్రయించింది కూటమి ప్రభుత్వం. నకిలీ ఇళ్ల పట్టాల కేసులో వల్లభనేని వంశీకి బెయిల్ మంజూరు చేసింది నూజివీడు కోర్టు.

ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ పై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరుగనుంది. కాగా వల్లభనేని వంశీకి బెయిల్ మంజూరు అయింది..నకిలీ ఇళ్ల పట్టాల కేసులో బెయిల్ మంజూరు చేసిన నూజివీడు కోర్టు… విడుదల చేయాలనీ పేర్కొంది.
జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు వల్లభనేని వంశీ. ఇప్పటి వరకు వంశీపై నమోదైన అన్ని కేసుల్లోనూ బెయిల్ మంజూరు అయ్యింది. దింతో ఆయన ఇవాళ జైలు నుంచి వంశీ విడుదల అయ్యే అవకాశం ఉంది. కానీ అంతలోనే వల్లభనేని వంశీ బెయిల్ రద్దు చేయాలని సుప్రీంకోర్టును ఆశ్రయించింది కూటమి ప్రభుత్వం.