ఐ లవ్ యూ చెప్పడం లైంగిక వేధింపు కాదని కోర్టు పేర్కొంది. మైనర్ అమ్మాయికి ఐ లవ్ యూ చెప్పిన యువకుడి కేసులో సంచలన తీర్పు ఇచ్చింది బాంబే హైకోర్టు. 2015వ సంవత్సరం అక్టోబర్ నెలలో 11వ తరగతి చదువుతున్న తమ మైనర్ కూతురికి ఒక యువకుడు ఐ లవ్ యూ చెప్పి లైంగికంగా వేధించాడని పోలీసులకు ఫిర్యాదు చేశారు తల్లిదండ్రులు.

దీంతో 2017వ సంవత్సరం ఆగస్టు నెలలో యువకుడికి 3 ఏళ్ల జైలు శిక్ష, రూ.5000 జరిమాన విధించింది నాగ్‌పూర్ సెషన్స్ కోర్టు. ఈ తీర్పును సవాల్ చేస్తూ యువకుడి తల్లిదండ్రులు బాంబే హైకోర్టును ఆశ్రయించగా, అతని నోటి నుండి ఐ లవ్ యూ అనే పదం వచ్చినంత మాత్రాన అది లైంగిక వేధింపు కాదని వ్యాఖ్యానించింది బాంబే హైకోర్టు. అతను ఎలాంటి లైంగిక వేధింపులకు పాల్పడట్టు ఆధారాలు లేవని నాగ్‌పూర్ సెషన్స్ కోర్టు ఇచ్చిన తీర్పును కొట్టేసింది బాంబే హైకోర్టు.