ఏపీ ప్రభుత్వం రైతులకు శుభవార్త అందజేసింది. అన్నదాత సుఖీభవ పథకాన్ని అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. మొదటి విడతలో రైతులకు కేంద్రం ఇచ్చే రూ. 2 వేలతో కలిపి రూ. 7 వేలు రైతుల ఖాతాల్లో జమ చేయాలని అధికారులు సిద్ధమవుతున్నారు.

గత నెలలోనే ఈ పథకం అమలు కావాల్సి ఉండగా పిఎం కిసాన్ నిధులు రిలీజ్ కాకపోవడంతో ఆలస్యం అవుతున్నట్లుగా సమాచారం అందుతుంది. దీంతో వారం రోజులలో రూ. 7వేలు రైతుల అకౌంట్లో జమ చేసే అవకాశం ఉన్నట్లుగా సమాచారం అందుతుంది. దీంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కూటమితో అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు అనేక రకాల పథకాలను అమలులోకి తీసుకు వస్తున్నారని సంతోషపడుతున్నారు.