GST Council: సామాన్యులకు ఊరట… కేంద్రం త్వరలోనే 12 శాతం జీఎస్టీ శ్లాబ్ ఎత్తివేసే అవకాశాలు ఉన్నాయని జాతీయ మీడియా వెల్లడించింది. చాలా వస్తువులను ఐదు శాతం శ్లాబ్ లోకి తీసుకొస్తారని సమాచారం అందుతుంది. కాగా, జీఎస్టీ విధానాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అమలులోకి తీసుకువచ్చారు.

దీంతో సామాన్యులపై అధికంగా భారం పడుతుందని కొంతమంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జీఎస్టీ శ్లాబ్ ఎత్తివేసే వస్తువులు ఎంటో ఇప్పుడు తెలుసుకుందాం. టూత్ పేస్ట్, కిచెన్ సామాగ్రి, గొడుగులు, కుట్టుమిషన్లు, గీజర్లు, సైకిళ్లు, ఐరన్ బాక్సులు, రూ. వెయ్యి రూపాయల పైన ఉండే రెడీమేడ్ దుస్తులు, రూ. 500- రూ. వెయ్యి మద్య ఉండే చెప్పులు, అగ్రికల్చర్ టూల్స్, స్టేషనరీ, వ్యాకిన్స్ పైన ధరలు తగ్గొచ్చని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. దీంతో సామాన్య ప్రజలు జిఎస్టి తగ్గుతుందని తెలిసి సంతోషం వ్యక్తం చేస్తున్నారు.