క్యాబ్ సంస్థలకు కేంద్రం శుభవార్త అందజేసింది. నామమాత్రంగా రద్దీ ఎక్కువగా ఉన్న సమయాలలో అప్పటి బేస్ చార్జీలలో సగం సర్ చార్జ్ కింద పెంచుకోవచ్చని తెలిపింది. అలాగే హై డిమాండ్ ఉన్న సమయాలలో సర్ చార్జ్ ను 200 శాతం వరకు పెంచుకోవచ్చని పేర్కొన్నారు. అయితే 3 కిలోమీటర్ల లోపు ప్రయాణించే వారికి అదనపు చార్జీలను వసూలు చేయకూడదు.

ప్రైవేట్ బైకులను కూడా ఉబర్, ఓలా, ర్యాపిడోలో వాడుకోవచ్చని పేర్కొన్నారు. కాగా నేటి కాలంలో క్యాబ్ ల వాడకం విపరీతంగా పెరిగిపోయింది. హైదరాబాద్ లాంటి మహా నగరాలలో ప్రతి ఒక్కరూ క్యాబ్ సేవలను అధికంగా వినియోగించుకుంటున్నారు. బైక్, క్యాబ్ లలో ప్రయాణం చేస్తే సేఫ్టీగా ఉంటుందని భావిస్తున్నారు.