కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. మా ప్రభుత్వంలో చంద్రబాబు కోవర్టులు ఉన్నారని బాంబు పేల్చారు కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి. పరోక్షంగా కొందరు కాంగ్రెస్ నేతలపై సంచలన వ్యాఖ్యలు చేసారు కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి.

బాబు మంచోడని, మహాత్ముడని కాంగ్రెస్ ప్రభుత్వంలోనే బాబు కోవర్టులు మాట్లాని నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న బాబు కోవర్టులను ఏరివేస్తే తప్ప పార్టీ బాగుపడదని పేర్కొన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇరిగేషన్ ప్రాజెక్టులు, రోడ్ల కాంట్రాక్టులు.. దందాలు అన్నీ ఆంధ్రావాళ్లవే అని ఆగ్రహించారు. అన్ని కట్ చేస్తేనే ఆంధ్ర పాలకులు వెనక్కి తగ్గి వారంలో బనకచర్ల ప్రాజెక్టు విషయం వదిలేస్తారన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి.