ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు నాయుడు మాజీ ముఖ్యమంత్రి జగన్ పై సీరియస్ అవుతున్నారు. జగన్ మరో కొత్త డ్రామాకు తెర లేపారని చంద్రబాబు మండిపడ్డారు. ఆయన కారు కింద వాళ్ల కార్యకర్త పడిపోతే తీసి కుక్కపిల్ల లాగా బయటపడేసారని అన్నారు. సకాలంలో ఆసుపత్రికి తీసుకువెళ్లకపోవడం వల్లే సింగయ్య మరణించాడు.

కానీ సింగయ్య భార్యను పిలిపించి అంతా సెట్ చేసుకున్నారు. కారు కింద పడితే తన భర్తకు ఎలాంటి ప్రమాదం జరగలేదని ఆంబులెన్స్ లో తీసుకెళ్తేనే ఏమో జరిగిందని సింగయ్య భార్య అన్నారు. ఇలాంటి డ్రామాలు జగన్ ఎన్నో ఆడారని సీఎం చంద్రబాబు నాయుడు సీరియస్ అవుతున్నారు. చంద్రబాబు నాయుడు చేసిన ఈ వాఖ్యలపై మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఎలా స్పందిస్తారో చూడాలి. కాగా, జగన్మోహన్ రెడ్డి చేసిన పాదయాత్రలో భాగంగా సింగయ్య కారు కింద పడి మరణించారు. ఈ విషయం పైన జగన్ మోహన్ రెడ్డిపై పోలీసులు కేసు కూడా నమోదు చేశారు.