ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు బిగ్ అలర్ట్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తల్లికి వందనం నిధులు విడుదల కాబోతున్నాయి. ఇప్పటికే మొదటి విడత నిధులను విడుదల చేసింది చంద్రబాబునాయుడు కూటమి ప్రభుత్వం. ఇక ఇప్పుడు తల్లికి వందనం రెండవ విడత నగదును విడుదల చేయబోతున్నారు.

ఈనెల 10వ తేదీన అంటే సరిగ్గా వారం రోజుల తర్వాత రెండో విడత డబ్బులు విడుదల చేసేందుకు చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ పథకం కింద తొలి విడతలో 67.27 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి చేకూరిన సంగతి తెలిసిందే. ఒకటో తరగతి నుంచి ఇంటర్ ఫస్టియర్ లో చేరిన విద్యార్థులకు రెండవ విడుదల నగదు విడుదల చేయనుంది. ఐదవ తేదీనే ఇస్తామని తొలత చెప్పినప్పటికీ అడ్మిషన్లు ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో వాయిదా వేసినట్లు తాజాగా వెల్లడించింది సర్కారు.