కొణిజేటి రోశయ్యకు అరుదైన గౌరవం దక్కింది. తెలంగాణలో ఇకపై ఏటా అధికారికంగా జూలై 4న స్వర్గీయ కొణిజేటి రోశయ్య జయంతి నిర్వహించాలని నిర్ణయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం. ఈ బాధ్యతను తెలంగాణ పర్యాటక సాంస్కృతిక శాఖకు అప్పగించింది ప్రభుత్వం.

అన్ని జిల్లా కేంద్రాల్లో కలెక్టర్లు పాల్గొని రోశయ్య జయంతి నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు. కాగా, కాంగ్రెస్ ప్రభుత్వంలో 16 సార్లు ఆర్థిక శాఖ మంత్రి హోదాలో బడ్జెట్ ప్రవేశపెట్టిన ఘనత రోశయ్యదే. ఈ తరుణంలోనే తెలంగాణలో ఇకపై ఏటా అధికారికంగా జూలై 4న స్వర్గీయ కొణిజేటి రోశయ్య జయంతి నిర్వహించాలని నిర్ణయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం.