ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మందుబాబులు రెచ్చిపోతున్నారు. ఓటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మంచి బ్రాండ్లు దొరకడంతో…. విపరీతంగా తాగేస్తున్నారు మందుబాబులు. ఈ నేపథ్యంలోనే విపరీతంగా తాగిన మందుబాబులు… రోడ్ల పైన రకరకాల చేష్టలు చేస్తూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు. ముఖ్యంగా విజయవాడ లాంటి పట్టణంలో ఇలాంటి సంఘటనలు ఎక్కువవుతున్నాయి.
ఇటీవల బాగా తాగిన ఓ మందుబాబు స్కూటీ రోడ్డుపైన పడేసి అక్కడే పడుకున్నాడు. ఇక ఇప్పుడు విజయవాడలో మరో సంఘటన జరిగింది. ఇద్దరు మందుబాబులు రోడ్డు డివైడర్ కూర్చొని.. మద్యం సేవించారు. తాగిన గ్లాస్ కూడా నడిరోడ్డు పైన…. పడేశారు. ఎదురుగా ఉన్న వైన్స్ లో మద్యం తీసుకువచ్చి.. అక్కడే తాగేశారు. ఈ సంఘటన ఇప్పుడు వైరల్ గా మారింది. దీనిపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.
విజయవాడలో నడి రోడ్డు మీద తీర్థం పుచ్చుకుంటున్న మందు బాబులు pic.twitter.com/y86wDAXrRK
— Telugu Scribe (@TeluguScribe) July 2, 2025