సీఎం చంద్రబాబు నాయుడుకు ఊహించని షాక్ తగిలింది. ఏపీ సీఎం చంద్రబాబు ఇంటి ముందు యోగా టీచర్లు ఆందోళన చేపట్టారు. యోగాంధ్ర గిన్నీస్ రికార్డ్ అనంతరం రోడ్డెక్కారు యోగా టీచర్లు. కరకట్ట వద్ద సీఎం చంద్రబాబు నాయుడు ఇంటి ముందు యోగాసనాలతో నిరసన వ్యక్తం చేశారు యోగా టీచర్లు.

ఏపీ మంత్రి నారా లోకేష్ తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేసారు. ఈ తరుణంలోనే సీఎం చంద్రబాబు నాయుడు ఇంటి దగ్గర నుండి వెళ్లిపోవాలని పోలీసులు వార్నింగ్ ఇచ్చారు. పాఠశాలల్లోని 1056 మంది యోగ టీచర్ల కు న్యాయం చేయాలని, ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న తమకు వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు.
యోగాంధ్ర గిన్నీస్ రికార్డ్ అనంతరం రోడ్డెక్కిన యోగా టీచర్లు..
కరకట్ట వద్ద సీఎం @ncbn ఇంటి ముందు యోగాసనాలతో నిరసన వ్యక్తం చేసిన యోగా టీచర్లు..
మంత్రి @naralokesh తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్.. సీఎం ఇంటి దగ్గర నుండి వెళ్లిపోవాలని పోలీసులు వార్నింగ్
పాఠశాలల్లోని… pic.twitter.com/HkJzH6kuI3
— Telugu Feed (@Telugufeedsite) July 3, 2025