తెలంగాణ రాష్ట్ర ప్రజలకు బిగ్ అలెర్ట్. బోనాల ఉత్సవాల్లో డీజేకు నో పర్మిషన్ అంటూ పోలీసులు ప్రకటించారు. సికింద్రాబాద్ మహంకాళి బోనాల ఉత్సవాల్లో డీజేకు అనుమతులు లేవని డీసీపీ రష్మీ తెలిపారు. మహంకాళి బోనాల ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించిన డీసీపీ మీడియాతో మాట్లాడారు.

భక్తుల భద్రత కోసం 1500 మంది పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. వాహనాలకు ప్రత్యేక పార్కింగ్ ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు.
- సికింద్రాబాద్ మహంకాళి బోనాల ఉత్సవాల్లో డీజేకు నో పర్మిషన్: డీసీపీ రష్మీ
- మహంకాళి బోనాల ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించిన డీసీపీ రష్మీ
- భక్తుల భద్రత కోసం 1500 మంది పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తున్నట్లు వెల్లడి
- వాహనాలకు ప్రత్యేక పార్కింగ్ ఏర్పాట్లు చేసినట్లు డీసీపీ ప్రకటన