తిరుమల ఘాట్ రోడ్డులో ఏనుగుల గుంపు కలకలం రేపింది. గురువారం రాత్రి 9 గంటల సమయంలో ఏనుగుల ఆర్చ్ వద్దనున్న రోడ్డు సమీపానికి పిల్ల ఏనుగులతో పాటు మొత్తం ఏడు ఏనుగులు వచ్చాయి. దింతో సమాచారం అందుకున్న అటవీ సిబ్బంది అక్కడికి చేరుకుని టార్చ్లైట్లు వేస్తూ సైరన్లు మోగించడంతో తిరిగి అడవిలోకి వెళ్లిపోయింది ఏనుగుల గుంపు.

దింతో వాహనదారులను అప్రమత్తం చేసి పంపిన ఫారెస్ట్, విజిలెన్స్ సిబ్బంది… ప్రమాదం జరుగకుండా చర్యలు తీసుకున్నారు.
తిరుమల ఘాట్ రోడ్డులో ఏనుగుల సంచారం
తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో గురువారం రాత్రి ఏనుగుల గుంపు సంచరించడంతో భక్తులు, వాహనదారులు భయాందోళనకు గురయ్యారు. ఏడో మైలు ప్రాంతంలో ఏనుగులు కనిపించడంతో ట్రాఫిక్ స్తంభించింది. అటవీశాఖ సిబ్బంది ఏనుగులను అడవిలోకి మళ్లించారు. భక్తులు అప్రమత్తంగా… pic.twitter.com/8TEgNSChc3
— ChotaNews App (@ChotaNewsApp) July 4, 2025