ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంచి మనసు చాటుకున్నారు. గిరిజనులకు మామిడి పండ్లు పంపారు డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. అల్లూరి జిల్లా కురిడి గ్రామస్తులకు తన తోటలో పండిస్తున్న ఆర్గానిక్ మామిడి పండ్లను స్వయంగా ఏపీ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కానుకగా పంపడం జరిగింది. ఆ గ్రామంలోని మొత్తం 230 ఇండ్లకు అరుణ చొప్పున మామిడి పండ్లను పంపిణీ చేసింది పవన్ కళ్యాణ్ టీం.

దింతో మామిడి పండ్లను తింటూ ఆదివాసులు తెగ మురిసిపోతున్నారు. అలాగే పవన్ కళ్యాణ్ తమను గుర్తుపెట్టుకొని మరి పండ్లు పంపడం ఆనందంగా ఉందని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఇది ఇలా ఉండగా అధికారంలోకి వచ్చిన తర్వాత గిరిజన గ్రామాలను ప్రత్యేకంగా డెవలప్మెంట్ చేసేందుకు పవన్ కళ్యాణ్ నడుము బిగించారు. అడవి తల్లి బాట ప్రోగ్రాం కు శ్రీకారం చుట్టారు డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. ఇందులో భాగంగానే గిరిజనుల సమస్యలను తెలుసుకుంటున్నారు.