ప్రియుడి కోసం లింగ మార్పిడి చేయించుకున్నాడు ఓ యువకుడు. ఆ తర్వాత ప్రియుడు దూరం పెట్టడంతో అత్యాచార కేసు నమోదు చేశారు. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. మధ్యప్రదేశ్ – నర్మదాపురంలో 10 ఏళ్లుగా స్వలింగ సంపర్కులుగా కలిసి ఇద్దరు యువకులు జీవిస్తున్నారు.

చివరకు ఇద్దరు పెళ్లి చేసుకోవాలని భావించి.. లింగ మార్పిడి చేయించుకున్నాడు 25 ఏళ్ల యువకుడు. లింగ మార్పిడి పూర్తయ్యాక అమ్మాయిగా మారిన యువకుడిని పెళ్లాడేందుకు నిరాకరించాడు మరో యువకుడు. దీంతో అతనిపై అత్యాచారం చేశాడని ఫిర్యాదు చేసిన లింగ మార్పిడి చేసుకున్నాడు యువకుడు.. జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసి విచారణ జరుపుతున్నారు పోలీసులు.