ఫిష్ వెంకట్‌కు అండగా హీరో ప్రభాస్ నిలిచారు. ఇటీవల అనారోగ్యంతో బాధపడుతూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు ఫిష్ వెంకట్. తన తండ్రి పూర్తిగా మాట్లాడలేని స్థితిలో ఉన్నాడని, రెండు కిడ్నీలు పూర్తిగా చెడిపోయాయని ఎమోషనల్ అయ్యారు ఫిష్ వెంకట్ కూతురు స్రవంతి. ఇక ఆ ఆపరేషన్‌కు రూ.50 లక్షలు ఖర్చవుతుందని మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేశారు ఫిష్ వెంకట్ కూతురు స్రవంతి.

ఈ నేపథ్యంలో ప్రభాస్ టీం నుండి ఫోన్ వచ్చిందని, కిడ్నీ డోనర్ ఉంటే ఆపరేషన్‌కు సిద్ధం చేసుకోవాలని తెలిపారని మీడియాకు తెలిపారు ఫిష్ వెంకట్ కూతురు. ఆపరేషన్‌కు అవసరమయ్యే ఖర్చంతా ప్రభాస్ భరిస్తాడని తన సిబ్బంది చెప్పినట్లు మీడియాకు తెలిపారు ఫిష్ వెంకట్ కూతురు.