తాడిపత్రిలో మళ్ళీ టెన్షన్ నెలకొంది. తాజాగా ఎస్పీకి వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి లేఖ రాశారు. వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రి వెళ్లేందుకు మరోసారి యత్నాలు చేస్తున్నారు. అనుమతి కోరుతూ ఎస్పీ జగదీష్ కు లేఖ రాశారు కేతిరెడ్డి పెద్దారెడ్డి.

రీకాలింగ్ చంద్రబాబు మ్యానిఫెస్టో కార్యక్రమాన్ని తాడిపత్రి నియోజకవర్గంలో నిర్వహించాలి, అనుమతి ఇవ్వాలని ఎస్పీని కోరారు వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రి వెళ్లేందుకు ఏప్రిల్ 30 వ తేదీన ఆదేశాలు జారీ చేసింది హై కోర్టు. పెద్దా రెడ్డి తాడిపత్రి వెళ్లినప్పుడు తగిన భద్రత కల్పించాలని ఆదేశాలు జారీ చేశారు.