ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు జిల్లాలలో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ స్పష్టం చేసింది. శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, తూర్పుగోదావరి, ఏలూరు జిల్లాలలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు సూచనలు జారీ చేశారు. మిగతా ప్రాంతాలలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. వర్షం కురిసే సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశాలు ఉన్నందున ప్రజలు పలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచనలు జారీ చేశారు.

అలాగే తెలంగాణ ప్రాంతంలోని పలు జిల్లాలలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. తెలంగాణ ప్రాంతంలో వరుసగా మూడు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉంది. హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, నిజామాబాద్, మెదక్, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, కొమరవెల్లి ప్రాంతాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. మిగతా ప్రాంతాలలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. వర్షం అధికంగా కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. వర్షంతో పాటు ఈదురు గాలులు కూడా వీచే అవకాశాలు ఉన్నాయి.