తమిళ్ స్టార్ హీరో విజయ్ కి ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. తమిళనాడు రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని ప్లాన్ చేస్తున్న విజయ్ కి… ఆదిలోనే ఊహించని షాక్ తగిలింది. తమిళ్ హీరో ప్రారంభించిన రాజకీయ పార్టీ టీవీకే కు ప్రచారకర్తగా ప్రశాంత్ కిషోర్ ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఆ పార్టీకి తాత్కాలికంగా దూరమవుతున్నట్లు తాజాగా ప్రకటించారు.

టీవీ కే పార్టీ లక్ష్యానికి తన వంతు సహకారం అందిస్తానని ఇప్పటికే ప్రశాంత్ కిషోర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం బీహార్ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో తన జన స్వరాజ్ పార్టీతో పోటీ చేస్తున్నారు ప్రశాంత్ కిషోర్. అందుకే టీవీకే కు కొన్ని రోజులపాటు దూరం కానున్నారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికలు పూర్తికాగానే మళ్లీ రంగంలోకి దిగే ఛాన్సులు ఉన్నాయి. కాగా టీవీ కే పార్టీ సీఎం అభ్యర్థిగా ఇప్పటికే హీరో విజయ్ ని ప్రకటించారు. ఏ పార్టీతో కూడా పొత్తు పెట్టుకోకుండా సింగిల్ గా దిగుతోంది టి వి కే పార్టీ.