భారతదేశ ప్రజలకు బిగ్ అలర్ట్. రేపు భారత్ బంద్ కొనసాగనుంది. కార్మిక సంఘాల పిలుపు మేరకు భారత్ బంద్ కొనసాగనుంది. కేంద్ర విధానాలు వ్యతిరేకిస్తూ పది కార్మిక సంఘాలు అలాగే అనుబంధ సంఘాల ఐక్యవేదిక.. ఈ మేరకు ప్రకటన చేసింది. రేపు భారత్ బంద్ పాటించాలని వెల్లడించింది. బ్యాంకింగ్, పోస్టల్ అలాగే ఇన్సూరెన్స్ లాంటి రంగాలకు చెందినవారు బంద్ లో పాల్గొననున్నారు.

రైతులతో కలిసి 25 కోట్ల మంది పాల్గొంటారని ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ నేత కూడా ఈ సందర్భంగా ప్రకటన చేశారు. 10 సంవత్సరాలుగా వార్షిక కార్మిక సమావేశం పెట్టకుండా కార్మిక వ్యతిరేక విధానాలు అవరంబిస్తున్నాయని ఈ సందర్భంగా కార్మిక సంఘాలు ఫైర్ అయ్యాయి. అయితే రేపు భారత్ బంద్ ఉన్న నేపథ్యంలో పోలీస్ వ్యవస్థ మొత్తం అలర్ట్ అయింది. బందు విజయవంతం కాకుండా… కసరత్తులు చేస్తున్నారు అధికారులు.