తిరుమల శ్రీవారి భక్తులకు బిగ్ అలర్ట్. తిరుమల శ్రీవారి సన్నిధిలో భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది. మన ఆదివారం నుంచి ఇప్పటివరకు జనాలు వస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో తిరుమలలో శ్రీవారి భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది. దీంతో టోకెన్లు లేని భక్తులకు సర్వదర్శనానికి ఏకంగా 20 గంటల సమయం పడుతుందని అధికారులు చెబుతున్నారు.

ప్రస్తుతం నారాయణగిరి షెడ్ ల నుంచి క్యూ లైన్ కొనసాగుతోంది. ఇక నిన్న ఒక్కరోజే 80, 081 మంది తిరుమల శ్రీవారి భక్తులు.. వెంకన్న స్వామిని దర్శించుకోవడం జరిగింది. నిన్న ఒక్కరోజే తిరుమల శ్రీవారి హుండీ ద్వారా 4.48 కోట్ల ఆదాయం వచ్చింది అని కూడా అధికారులు చెప్పారు. 30 వేలకు పైగా శ్రీవారి భక్తులు తలనీలాలు సమర్పించారు. ఇవాళ కూడా రద్ది ఇలాగే కొనసాగుతుందని చెబుతున్నారు.