వైసిపి నేత ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యాలపై టిడిపి ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి స్పందించారు. వరుసకు చెల్లెలు అయ్యే తనపై ప్రసన్న కుమార్ రెడ్డి ఇలాంటి నీచపు వ్యాఖ్యాలు చేస్తున్నారని సీరియస్ అయ్యారు. తనపై దారుణమైన వ్యాఖ్యలు చేస్తున్న నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిని కోర్టుకు ఈడుస్తానంటూ ప్రశాంతి రెడ్డి అన్నారు.

ప్రతిసారి విపిఆర్ కు డబ్బు ఉందని మాజీ మంత్రి అనిల్ అంటున్నారు. ఆయనకు డబ్బులు లేవా ఆయన ఏమైనా అడుక్కు తింటున్నారా అనిల్ కు కూడా జైలు శిక్ష తప్పదు అంటూ వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి అన్నారు. ప్రస్తుతం ప్రశాంతి రెడ్డి చేసిన ఈ వాక్యాలు సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. అటు నెల్లూరు సుజాతమ్మ కాలనీలోని తన ఇంటిపై జరిగిన దాడి ఘటనపై వైసిపి నేత నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి రియాక్ట్ అయ్యారు. నెల్లూరు జిల్లాలో దాడి సంస్కృతి ఎప్పుడూ జరగలేదు. వేమిరెడ్డి దంపతులు ఇలా రాజకీయం చేస్తారని అస్సలు అనుకోలేదన్నారు.