పెళ్లి చేసుకోకపోతే మరో జన్మ ఎత్తాలా..? లేకపోతే రుణవిముక్తి కాదా..?

-

ఒకప్పుడు 20 దాటగానే పెళ్లి చేసేవాళ్లు. కానీ ఇప్పుడు 25 ఏళ్లు వచ్చినా ఎవరికీ పెళ్లీ చేసుకోవాలనే ఇంట్రస్ట్‌ రావడం లేదు. కొంతమంది అయితే పెళ్లి అంత అర్జెంటా, అంత ముఖ్యమా.. పెళ్లి చేసుకోని ఎవడు బాగుపడ్డాడు. ఆ లొల్లి అంతా ఎందుకు అని ఇంట్లో వాళ్లతో వాదిస్తున్నారు. పెళ్లి చేసుకోకకపోతే ఎలా..? ఇప్పుడంటే వయసు మీద ఉన్నారు కాబట్టి ఏం తెలియడం లేదు. కానీ ముసలి వాళ్లు అయ్యాక మీకు ఒక తోడు కావాలి, పెళ్ళి చేసుకోకపోతే.. జీవితాంత ఒంటరిగా ఉండాలి, తల్లిదండ్రులు కొన్నాళ్లే ఉంటారు అని కొందరు అంటారు. అసలు పెళ్లి ఎందుకు చేసుకోవాలి, పురణాలు ఏం చెబుతున్నాయో చూద్దామా..!

పెళ్లి ఉత్సవం కాదు..మనిషి జీవితంలో పాటించాల్సిన షోడశ సంస్కారాలలో ప్రధానమైనది. సానపెట్టడం వల్ల వజ్రం ఎలా ప్రకాశిస్తుందో సంస్కారాల వల్ల ఆత్మ ప్రకాశిస్తుంది. జీవితం సార్థకం, సుఖవంతం, ఆనందమయం అవుతుంది. వివాహంలోని మంత్రాల అర్థం పరమార్థం పూర్తిగా తెలియకపోవడం వల్ల ఏదో తంతు త్వరగా పూర్తిచేశామా లేదా అన్నదే చూసుకుంటున్నారు నేటి తరం..ఫొటోలు, వీడియోలు, విందులకు ఇచ్చిన ప్రాధాన్యత ముఖ్యమైన సంస్కారానికి ఇవ్వడం లేదు. అందుకే వైవావిక జీవితంలో ఎన్నో సమస్యలు.

పెళ్లిచేసుకోవడం అనేది మూడు రుణాలు తీర్చుకునేందుకే అని పండితులు అంటున్నారు. ప్రతీ మనిషీ మూడు ఋణాలతో పుడతాడు

1. ఋషిఋణం

2. దేవఋణం

3. పితౄణం

ఈ మూడు రుణాలను తీర్చడం ప్రతి ఒక్కరి విధి. ఈ రుణాలు తీర్చకపోతే మరో జన్మ ఎత్తవలసి వస్తుందట.. ఒక్కసారి మనిషిగా పుట్టినవాళ్లు ఎవరూ మళ్లీ జన్మంటూ ఉంటే మనిషిలా పుట్టొద్దురా నాయనా అనుకుంటారు. మానవజన్మకు సార్థకత జన్మరాహిత్యం. అందుకే ప్రతిక్కరూ రుణవిముక్తులు కావాలి. దానికి పరిష్కారమే పెళ్లి

ఋషి ఋణం

బ్రహ్మచర్యం ద్వారా ఋషి ఋణం తీర్చాలి. అంటే బ్రహ్మచర్యంలో వేదాధ్యయనం చేయాలి, దైవారాధనలో ఉండాలి, గురువులను పూజించాలి. పురాణాలు మొదలైన వాగ్మయాన్ని అధ్యయనం చేసి తరువాత తరం వారికి వాటిని అందించడం ద్వారా ఈ ఋణాన్ని తీర్చుకున్నవాళ్లం అవుతామట.

దేవఋణం

యజ్ఞ యాగాది క్రతువులు చేయడం, చేయించడం ద్వారా ఈ ఋణాన్ని తీర్చుకోవాలి. యజ్ఞం అంటే త్యాగం. యజ్ఞాలవల్ల దేవతలు తృప్తి చెందుతారు. సకాలంలో వర్షాలు కురుస్తాయి. పాడిపంటలు వృద్ధి చెందుతాయి. కరువు కాటకాలు ఉండవు. నీరు, గాలి, వెలుతురు, ఆహారాన్ని ప్రసాదిస్తున్న వారందరికి మనమెంతో ఋణపడివున్నాం. ఆ ఋణాన్ని తీర్చకపోతే మనం కృతఘ్నలం అవుతాం.

పితౄణం

సత్సంతానాన్ని కనడం ద్వారా ఈ ఋణం తీరుతుంది.. తల్లిదండ్రులు ప్రత్యక్ష దైవాలు, మనకు జన్మనిచ్చి పెంచి పోషించినవారు. వంశాన్ని అవిచ్చిన్నంగా కొనసాగించడం ద్వారా పితృ దేవతలకు తర్పణాది క్రియలు నిర్వహించే యోగ్యులైన సంతానాన్ని కనడం ద్వారా పితౄణం తీర్చుకోవాలి. సంతానం కలగాలంటే వివాహం చేసుకోవాలి కదా. యజ్ఞాలలో పంచ యజ్ఞాలు విధిగా ప్రతి మనిషీ చేయాలి.

అది.. పండితులు చెప్పేమాట.. వీటిని నమ్మని వాళ్లు ఉంటారు. మనం ఏం చేయలేం.. కేవలం పెళ్లి ఎందుకు చేసుకోవాలో పండితులు ఏం చెప్పారో మాత్రమే ఇక్కడ అందించాం. వీటికి ఆధారాలు లేవు.

Read more RELATED
Recommended to you

Latest news