మరోసారి మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. నాలో ఉంది నల్లపరెడ్డి శ్రీనివాస్ రెడ్డి రక్తం అన్నారు. మాకు భయం అంటే ఏంటో తెలియదు, మేము ఎంత దూరమైనా వెళ్తామని పేర్కొన్నారు. నాకు చేతి నొప్పి వల్ల ఆసుపత్రికి వెళ్లాను, ఎక్కడికీ పారిపోలేదు… ఇప్పుడంటే ఇప్పుడొచ్చి నన్ను అరెస్ట్ చేసి తీసుకెళ్లండి స్పష్టం చేశారు.

నా ఇంటి మీద జరిగిన దాడిపై పోలీసులు నిజాయితీగా దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. ఇంటి మీదకు ఎవరెవరు వచ్చారో మా దగ్గర అన్ని వీడియోలు ఉన్నాయి… దాడిలో పాల్గొన్న వారిలో నలుగురు సీనియర్ నేతలు కూడా ఉన్నారన్నారు. నా కాళ్లు చేతులు కట్టేసి ఆమె కాళ్ల కింద పడేయాలని వాళ్ల మనుషులకు చెప్పిందంట… ఎవడొస్తాడో రండి చూద్దాం నేను ఇక్కడే ఉంటాను అంటూ మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి సవాల్ చేశారు.