వివాదంలో ఏపీ బీజేపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ చిక్కుకున్నారు. తెలంగాణ రాష్ట్రం లేకుండా ఉన్న ఇండియా మ్యాప్‌ను నారా లోకేష్‌కు బహుకరించారు ఏపీ బీజేపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్. అయితే దీనిపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ శ్రవణ్ ఫైరియ్యారు. ఏపీ నాయకులు తెలంగాణ రాష్ట్ర గుర్తింపును తుడిచేయాలని ప్రయత్నం చేస్తున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ శ్రవణ్ ఆరోపణలు చేశారు. ఏపీ బీజేపీ చీఫ్ యాదవ్ తాజాగా భారత దేశ పటాన్ని గిఫ్ట్ గా అందించారు.

ఇందులో తెలంగాణని ప్రత్యేకంగా చూపకుండా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ను చూపించారని శ్రవణ్ సీరియస్ అయ్యారు. ఇది తెలంగాణ గుర్తింపుపై ఆంధ్రప్రదేశ్ నేతలు చేస్తున్న రాజకీయ కుట్రను సూచిస్తుందని ట్వీట్ చేశారు. ఈ విషయం పైన కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని తెలంగాణ డిజిపిని ఎమ్మెల్సీ శ్రవణ్ కోరారు.