స్థానిక ఎన్నికలపై కీలక అప్డేట్ వచ్చింది. ఆగస్టు లోపు స్థానిక ఎన్నికల ప్రక్రియ పూర్తి కానుంది. ఆగస్టు నెలాఖరు కల్లా పరిషత్, సర్పంచ్ ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయనున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించింది. పంచాయతీరాజ్ చట్ట సవరణ ఆర్డినెన్స్ ను గవర్నర్ వారం లోపే జారీ చేసే అవకాశం ఉంది.
ఆ తర్వాత పది రోజుల్లోపే రిజర్వేషన్లు ఖరారు చేయనున్నట్లు సమాచారం అందుతోంది. తొలుత పరిషత్, ఆపై సర్పంచ్ ఎన్నికలు నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇక అటు బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేశాకే స్థానిక ఎన్నికలకు వెళ్తామన్నారు పొంగులేటి. రిజర్వేషన్ల అమలుకు 2018లో తెచ్చిన చట్టాన్ని సవరించాలని నిర్ణయించాం… గత మంత్రి వర్గ సమావేశా ల్లో ఆమోదించిన అంశాల అమలుపై సమీక్ష మని ప్రకటించారు మంత్రి పొంగు లేటి శ్రీనివాస్ రెడ్డి. దేశానికే ఆదర్శంగా రాష్ట్రంలో కులగణనను విజయవంతంగా పూర్తి చేశామని పేర్కొన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.