ఏపీ విద్యార్థులకు పొంగూరు నారాయణ శుభవార్త అందజేశారు. నారాయణ విద్యాసంస్థల్లో ఫ్రీగా కోచింగ్ అందుబాటులోకి తీసుకువచ్చారు మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ. పేద విద్యార్థుల కోసం ఆలోచించి ఈ నిర్ణయం తీసుకొని తన గొప్ప మనసును చాటుకున్నారు.

ఐఐటి, నీట్ పరీక్షలలో కొద్ది మార్కుల తేడాతో సీట్లు కోల్పోయిన ఎస్సీ, ఎస్టీ, వసతి గృహాలు, గురుకులాలలో చదివే విద్యార్థులకు నారాయణ విద్యాసంస్థలలో ఫ్రీగా కోచింగ్ ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. ఈ సంవత్సరం 80 మందికి ఈ అవకాశాన్ని కల్పిస్తున్నారు. ఈ విషయాన్ని స్వయంగా మంత్రి నారాయణ స్పష్టం చేశారు. విద్యార్థులకు భోజనం, మెటీరియల్, వసతి ఉచితంగా అందిస్తామని మంత్రి నారాయణ వెల్లడించారు. దీంతో విద్యార్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.