కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్ కు ఊహించని పరిణామం చోటు చేసుకుంది. లోక్ జనశక్తి అధినేత, కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్‌ను చంపేస్తామంటూ బెదిరింపులకు దిగారు. చిరాగ్‌ను చంపేస్తామంటూ ‘టైగర్ మెరాజ్ ఇడిసి’ పేరుతో ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టారు.

ఈ మేరకు ఈ విషయాన్ని స్పష్టం చేసింది పార్టీ ప్రతినిధి రాజేశ్ భట్. లోక్ జనశక్తి అధినేత, కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్ సంఘటన నేపథ్యంలోనే పాట్నాలోని సైబర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు అయింది.