BRS పార్టీ ఎమ్యెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డికి చెందిన అనురాగ్ యూనివర్సిటీలో ప్రమాదం జరిగింది. అనురాగ్ యూనివర్సిటీలో నిర్మాణంలో భవనం స్లాబ్ కూలి నలుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. మేడ్చల్ జిల్లా పోచారం పీఎస్ పరిధి వెంకటాపూర్ లో ఈ ఘటన చోటు చేసుకుంది.

జనగాం ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డికి చెందిన అనురాగ్ యూనివర్సిటీలో ఈ ప్రమాదం జరిగింది. FTLలో నిర్మాణాలు చేపడుతున్నారని గతంలో పలువురు ఫిర్యాదు చేశారు. పక్కనే ఉన్న పల్లా రాజేశ్వర్ రెడ్డికి చెందిన నీలిమా ఆసుపత్రికి కార్మికులను తరలించారు. యూనివర్సిటీ, ఆసుపత్రి సిబ్బంది.. మీడియాను లోపలికి అనుమతించడం లేదని సమాచారం అందుతోంది.
అనురాగ్ యూనివర్సిటీలో నిర్మాణంలో భవనం స్లాబ్ కూలి నలుగురికి తీవ్ర గాయాలు
మేడ్చల్ జిల్లా పోచారం పీఎస్ పరిధి వెంకటాపూర్ లో ఘటన
జనగాం ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డికి చెందిన అనురాగ్ యూనివర్సిటీ
FTLలో నిర్మాణాలు చేపడుతున్నారని గతంలో పలువురు ఫిర్యాదు
పక్కనే ఉన్న పల్లా రాజేశ్వర్… pic.twitter.com/2NhzLrHv8w
— BIG TV Breaking News (@bigtvtelugu) July 12, 2025