టాలీవుడ్ ఇండస్ట్రీని ప్రముఖ నటులు కోట శ్రీనివాసరావు వదిలేశారు. ప్రముఖ నటులు కోట శ్రీనివాసరావు తాజాగా చనిపోయారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న కోట… ఇవాళ మరణించారు. ఈ రోజు తెల్లవారుజామున 4 గంటలకు హైదరాబాద్‌లోని తన నివాసంలో కన్నుమూశారు ప్రముఖ నటులు కోట శ్రీనివాసరావు.

750 కి పైగా సినిమాలు తీసిన టాలీవుడ్ నటుడు కోట శ్రీనివాసరావు 83 సంవత్సరాల వయసులో మృతి చెందారు. గత కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు కోట శ్రీనివాస రావు. ముఖ్యంగా షుగర్ వ్యాధి ఆయనకు… భారీగా ఉందని చెబుతున్నారు. ఇటీవల బండ్ల గణేష్… కోట శ్రీనివాసరావును కలిసిన సమయంలో ఇదే విషయం బయటపడింది. అంత లోనే కోట శ్రీనివాస రావు మృతి చెందారు. కోట శ్రీనివాసరావు మృతి చెందిన నేపథ్యంలో టాలీవుడ్ పెద్దలందరూ.. ఆయన ఇంటికి చేరుతున్నారు. కొంతమంది సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలుపుతున్నారు.