ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఫీజు రీయింబర్స్ మెంట్ కోసం ఏపీ ప్రభుత్వం రూ. 600 కోట్లు విడుదల చేసింది. 2024-25 ఏడాదికి అదనపు మొత్తం విడుదల చేసినట్లు ప్రకటించింది ఉన్నత విద్యాశాఖ. ఇప్పటికే మొదటి విడతగా ఫీజు రీయింబర్స్ మెంట్ కు రూ. 788 కోట్లు చెల్లించామని పేర్కొంది ఏపీ ప్రభుత్వం.

త్వరలో మరో రూ. 400 కోట్లు విడుదల చేస్తామన్న విద్యాశాఖ కార్యదర్శి… 2024-25 ఏడాదికి అదనపు మొత్తం విడుదల చేసినట్లు ప్రకటించారు. దశలవారీగా బకాయిలన్నీ చెల్లిస్తామని విద్యా సంస్థలకు స్పష్టం చేసింది ప్రభుత్వం.