పాలకుర్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే యశస్విని రెడ్డిపై తిరగబడ్డ సొంత గ్రామ ప్రజలు !

-

పాలకుర్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే యశస్విని రెడ్డిపై తిరగబడ్డారు సొంత గ్రామ ప్రజలు. సొంత ఊరిలో ఇప్పటి వరకు రోడ్లు వేయించలేదు.. సమస్యలు చెప్పడానికి వెళ్తే పట్టించుకోవడం లేదంటూ యశస్విని రెడ్డిపై సొంత గ్రామ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే యశస్విని రెడ్డి సొంత గ్రామం చర్లపాలెంలో కాంగ్రెస్ పార్టీ మీటింగ్‌లో టెంట్‌ను కూల్చేశారు గ్రామ కాంగ్రెస్ నాయకులు.

The people of his own village have revolted against Palakurthi Congress MLA Yashaswini Reddy
The people of his own village have revolted against Palakurthi Congress MLA Yashaswini Reddy

తొర్రూరు మండల ఇంచార్జ్ రాఘవ రావును నిలదీసారు గ్రామ కాంగ్రెస్ నాయకులు. ఎమ్మెల్యే యశస్విని రెడ్డి సొంత గ్రామాన్ని పట్టించుకోదా అని ఇంచార్జ్ రాఘవ రావును నిలదీశారు గ్రామస్థులు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఏర్పాటు చేసిన మీటింగ్‌లో టెంట్‌ను కూల్చేసి, ఎమ్మెల్యేపై నిరసన తెలిపారు స్థానిక కాంగ్రెస్ కార్యకర్తలు. దింతో సమాధానం చెప్పకుండా వెళ్ళిపోయారు మండల ఇంచార్జ్ రాఘవ రావు.

Read more RELATED
Recommended to you

Latest news