తీన్మార్ మల్లన్న ఆఫీస్‌పై దాడి… గాల్లోకి 5 రౌండ్లు కాల్పులు

-

మేడిపల్లిలోని MLC తీన్మార్ మల్లన్న ఆఫీస్‌పై దాడి జరిగింది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు నిరసనగా తెలంగాణ జాగృతి కార్యకర్తులు మల్లన్న ఆఫీస్‌పై దాడి జరిగినట్లు తెలుస్తోంది. ఆఫీస్‌లోని ఫర్నిచర్ మొత్తాన్ని జాగృతి కార్యకర్తలు ధ్వంసం చేశారు.

Teenmar Mallanna's office attacked by kavitha gang
Teenmar Mallanna’s office attacked by kavitha gang

ఈ క్రమంలో మల్లన్న గన్‌మెన్ 5 రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపారు. ఇది ఇలా ఉండగా.. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఇవ్వడం వెనుక తమ పోరాటాలు ఉన్నాయని కవిత సెలబ్రేషన్స్ చేసుకున్నారు. అయితే కల్వకుంట్ల కవిత చేసిన కామెంట్లకు కౌంటర్ ఇచ్చారు తీన్మార్ మల్లన్న. రావులకు బీసీలకు ఏం పొత్తు…? అంటూ కల్వకుంట్ల కవితపై ఫైర్ అయ్యారు తీన్మార్ మల్లన్న. ఇలాంటి నేపథ్యంలోనే… కల్వకుంట్ల కవిత అనుచరులు… తీన్మార్ మల్లన్న ఆఫీస్ పై దాడి చేసినట్లు చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news