మెగా హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో తప్పకుండా సినిమా చేస్తాను అంటూ డైరెక్టర్ మెహర్ రమేష్ సంచలన కామెంట్లు చేశారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రమేష్ పవన్ కళ్యాణ్ తో తప్పకుండా సినిమా చేయాలని ఓ కల ఉందని అన్నారు. మెగా హీరో చిరంజీవితో సినిమా తీయాలని ఎప్పుడు కలలు కనేవాడిని. ఆ కోరిక బోలా శంకర్ సినిమాతో నెరవేరింది. ఇక భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ తో తప్పకుండా సినిమాను చేస్తాను ఆ కల కూడా నెరవేర్చుకుంటాను అని చెప్పారు.

కాగా, బోలాశంకర్ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. దీంతో మెహర్ రమేష్ పై మెగా అభిమానులు ఫైర్ అవుతున్నారు. చిరంజీవితో చేసిన సినిమానే ఫ్లాప్ అయ్యింది. ఇప్పుడు మరోసారి పవన్ కళ్యాణ్ తో సినిమా చేసి మరో ఫ్లాప్ ఇవ్వాలని అనుకుంటున్నారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ కామెంట్లపై మెహర్ రమేష్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.