ప్యారా గ్లైడింగ్ చేస్తూ కిందపడి 25 ఏళ్ల యువకుడు మృతి చెందాడు. ఈ సంఘటన హిమాచల్ ప్రదేశ్ లో జరిగింది. హిమాచల్ ప్రదేశ్ – ఇంద్రునాగ్ టేకాఫ్ సైట్‌లో పారాగ్లైడర్ కూలిపోయి అహ్మదాబాద్‌కు చెందిన సతీష్ (25) మృతి చెందాడు. టేకాఫ్ సమయంలో గాల్లోకి లేవలేక కూలిపోయింది గ్లైడర్.

ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన టూరిస్ట్ సతీష్, పైలట్ సూరజ్.. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ టూరిస్ట్ సతీష్ మృతి చెందాడు. కాగా ఇదే ప్లేస్ లో జనవరిలో టేకాఫ్ సమయంలో గ్లైడర్ కూలిపోవడంతో అహ్మదాబాద్‌కు చెందిన భావ్‌సర్ ఖుషీ(19) అనే యువతి మృతి చెందాడు. 6 నెలల వ్యవధిలో ఇద్దరు చనిపోవడంతో సెప్టెంబర్ 15 వరకు పారాగ్లైడింగ్‌పై పూర్తి నిషేధాన్ని విధించారు డిప్యూటీ కమిషనర్.
ప్యారా గ్లైడింగ్ చేస్తూ కిందపడి 25 ఏళ్ల యువకుడు మృతి
హిమాచల్ ప్రదేశ్ – ఇంద్రునాగ్ టేకాఫ్ సైట్‌లో పారాగ్లైడర్ కూలిపోయి అహ్మదాబాద్‌కు చెందిన సతీష్ (25) మృతి
టేకాఫ్ సమయంలో గాల్లోకి లేవలేక కూలిపోయిన గ్లైడర్
ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన టూరిస్ట్ సతీష్, పైలట్ సూరజ్.. ఆసుపత్రిలో… pic.twitter.com/0wr9tk8rhs
— Telugu Scribe (@TeluguScribe) July 15, 2025