పర్యాటకులకు షాక్… శ్రీశైలం జలాశయానికి ఎగువ నుంచి వరద ఉధృతి తగ్గడంతో ప్రాజెక్ట్ గేట్లను అధికారులు మూసివేశారు. జూరాల – సుంకేసుల నుంచి 65,985 క్యూసెక్కుల వరద శ్రీశైలంకి వస్తుండగా… కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తి ద్వారా 68,247 క్యూసెక్కుల నీరు సాగర్ కు, పోతిరెడ్డిపాడుకు 20 వేల క్యూసెక్కులు రిలీజ్ చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తి నీటి మట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం 882.50 అడవుల నీరు ఉంది.

ఇక అటు అమరావతి నిర్మాణాలకు అవసరమైన ఇసుకను కృష్ణా నది నుంచి తవ్వి తీసుకోవడానికి కూటమి ప్రభుత్వం అనుమతులు జారీ చేసింది. ప్రకాశం బ్యారేజీకి ఎగువన డీసిల్టేషన్ కు రూ. 286 కోట్లు ఇచ్చేందుకు కావలసిన అనుమతులను మంజూరు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. టెండర్ల బాధ్యతలను జలవనరుల శాఖ, పర్యవేక్షణను CRDAకు అప్పగించింది. అన్ని అనుమతులు, నిబంధనల మేరకు మాత్రమే ఇసుకను తవ్వాలని ప్రభుత్వం CRDAను ఆదేశించింది.