గండికోటలో దారుణం చోటు చేసుకుంది. గండికోట లో ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థిని దారుణ హత్య జరిగింది. హత్యాచారంగా అనుమానిస్తున్నారు పోలీసులు. ప్రొద్దుటూరులోని ఓ కాలేజీలో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న విద్యార్థిని(17)ని గండికోటలో దారుణంగా హత్య చేశారు దుండగులు.

ఈ ఘటనకు సంబంధించి ఎర్రగుంట్ల మండలం హనుమాన్‌గుత్తి గ్రామానికి చెందిన లోకేశ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం అందుతోంది, సీసీ ఫుటేజీ ఆధారంగా నిందితున్ని గుర్తించారు పోలీసులు. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.