తెలంగాణ రాష్ట్రంలో ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్న గులాబీ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. గులాబీ పార్టీ కార్యకర్తలకు స్పెషల్ క్లాసులు నిర్వహించేందుకు రంగం సిద్ధం చేసుకుంది కెసిఆర్ టీం. ఇందులో భాగంగానే ఈనెల 19వ తేదీన ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించాలని అనుకుంటున్నారు.

ఈ నెల 19వ తేదీన బీఆర్ఎస్వీ కార్యకర్తలకు శిక్షణా తరగతులు జరుగనున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న విషప్రచారాలను తిప్పికొట్టేందుకు అవసరమైన విషయాలను బీఆర్ఎస్ విద్యార్థి విభాగానికి తెలియజేయనున్నారు కేటీఆర్, హరీష్ రావు. ఈ నెల 19వ తేదీన ఉప్పల్లోని ఒక ఫంక్షన్ హాల్లో కేటీఆర్, హరీష్ రావు అధ్యక్షతన శిక్షణ కార్యక్రమం జరుగుతుంది.