ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా నుంచి లీక్….షాక్ లో పవన్ !

-

 

పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్. ఈ సినిమా షూటింగ్ పునః ప్రారంభమైంది. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకు హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో వీరిద్దరి కాంబినేషన్లో రాబోతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొంటున్నాయి. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన హీరోయిన్ గా టాలీవుడ్ యంగ్ బ్యూటీ శ్రీ లీల నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ సమయంలో శ్రీ లీల, పవన్ కళ్యాణ్ మధ్యసాగుతున్న ఓ వీడియో లీక్ అయింది.

Leak from the movie Ustad Bhagat Singh
Leak from the movie Ustad Bhagat Singh

ఈ వీడియోను సోషల్ మీడియా మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ చేస్తున్నారు. దీంతో మేకర్స్ కి ఇది పెద్ద సమస్యగా మారుతుంది. ఈ వీడియో క్లిప్ ను ఎవరు వైరల్ చేశారని చర్చ కొనసాగుతోంది. కాగా ఈ సినిమాకు దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించగా… మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది. ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ రెగ్యులర్ గా జరగనుంది.

Read more RELATED
Recommended to you

Latest news