ముగ్గురితో విజయ్ రొమాన్స్

-

నోటాతో రీసెంట్ గా తన కెరియర్ లో డిజాస్టర్ ఫేజ్ చేసిన విజయ్ దేవరకొండ రిలీజ్ కు రెడీగా ఉన్న టాక్సీవాలా సినిమా మీద అంత హోప్స్ పెట్టుకోలేదని తెలుస్తుంది. ఇక ఈ సినిమా తర్వాత క్రాంతి మాధవ్ డైరక్షన్ లో సినిమా చేస్తున్న విజయ్ దేవరకొండ ఈ సినిమాతో మళ్లీ తన రొమాన్స్ పంథా కొనసాగిస్తాడని తెలుస్తుంది.

కె.ఎస్ రామారావు నిర్మాణంలో తెరకెక్కబోయే ఈ సినిమాలో విజయ్ సరసన రాశి ఖన్నా, ఐశ్వర్య రాజేష్ నటిస్తున్నట్టు తెలుస్తుంది. స్టార్ హీరోల పక్కన నటించిన రాశి ఖన్నా విజయ్ తో సినిమా చేయడం కచ్చితంగా సిని ప్రియులను అలరిస్తుందని చెప్పొచ్చు. కోలీవుడ్ లో సూపర్ ఫాంలో ఉన్న ఐశ్వర్య రాజేష్ కూడా విజయ్ సినిమాలో లక్కీ ఛాన్స్ కొట్టేసింది. ఇక ఈ ఇద్దరే కాదు ఈ సినిమాలో బ్రెజిల్ మోడల్ ఇజబెల్లే కూడా మరో హీరోయిన్ గా నటిస్తుందని తెలుస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news