‘వీరమల్లు’ సెట్ లోనే పాట పాడిన పవన్ కళ్యాణ్..!

-

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఓవైపు  ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా కొనసాగుతూనే.. మరోవైపు సినిమాలను కంటిన్యూ చేస్తున్నాడు. హరిహర వీరమల్లు సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి తొలుత క్రిష్ దర్శకత్వం వహించాడు. అతను మధ్యలో తప్పుకోవడంతో ఈ పాన్ ఇండియా మూవీకి జ్యోతి కృష్ణ దర్శకత్వం వహిస్తున్నాడు. 

పవన్ కెరీర్లో మొదటి పాన్ ఇండియా మూవీ కావడంతో దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇదిలా ఉంటే.. ఈ మూవీ పై ఇంట్రెస్టింగ్ విషయం గురించి తెలుసుకుందాం. ఈ సినిమాలో ఓ సందర్భానుసారం పవన్ గొంతుతో పాడాల్సిన సాంగ్ ఉంటుందట. ఈ సాంగ్ ని పవన్ సెట్ లో కేవలం గంటలోనే కంప్లీట్ చేసినట్టు సమాచారం. రికార్డింగ్ కోసం స్పెషల్ సెటప్ చేసి పవన్ తో గంట వ్యవధిలోనే ఫినిష్ చేశారట. ఆ సాంగ్ ఐడియా కూడా పవన్ దే అని తెలుస్తోంది. సాంగ్ అవుట్ పుట్ కూడా సూపర్ గా వచ్చినట్టు సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news