ఆ ఆలోచనను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉపసంహరించుకోవాలి : కిషన్ రెడ్డి

-

కర్వాన్ డివిజన్, కేసరి నగర్ హనుమాన్ టెంపుల్ ప్రాంతంలోని మూసి పరిధిలో పర్యటించిన అనంతరం కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేసాడు. మూసీ సుందరీకరణపై రేవంత్ రెడ్డి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. మూసీ పరివాహక ప్రాంతంలో అనేక మంది పేద ప్రజలు ఒక్కో ఇటుక పేర్చి, కష్టపడి ఇండ్లు కట్టుకున్నారు. అందుకు ఇక్కడి ప్రజలే సాక్ష్యం. 30 ఏండ్ల కిందటే ఇక్కడ నిర్మించుకున్న ఇండ్లకు కరెంట్ కనెక్షన్లతో పాటు నీటి సదుపాయం, రేషన్ కార్డులు, ఆధార్ కార్డులు, ఓటర్ కార్డులు ఇవ్వడం జరిగింది. అంతేకాదు ప్రభుత్వం ట్యాక్సులు కూడా వసూలు చేస్తోంది.

గత 30 ఏండ్ల కింద నిర్మించుకున్న పేదల ఇండ్లను కూల్చాలనుకోవడం ఏమాత్రం న్యాయం కాదు. దీనిపై సీఎం రేవంత్ మానవతాదృక్పథంతో వ్యవహరించాలి. పేద ప్రజల ఇండ్లు కూల్చడం ఏమాత్రం న్యాయం కాదు. అధికారంలోకి వచ్చిన ఏ ప్రభుత్వమైనా పేద ప్రజల కోసం, వారి సంక్షేమం కోసం పనిచేయాలి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పేద ప్రజలకు ఒక్క ఇల్లు కట్టించలేదు. రెక్కాడితే గాని డొక్కాడనటువంటి వేలాది మంది ప్రజలు మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్నారు. నిజాం హయాంలో మూసీకి ఇరువైపులా రిటైనింగ్ వాల్ నిర్మించారు. కాంగ్రెస్ ప్రభుత్వం మూసీకి ఇరువైపులా రిటైనింగ్ వాల్ నిర్మించి మూసీ బ్యూటిఫికేషన్ చేయాలి. మూసీ పరివాహక ప్రాంతాల్లోని ప్రజలందరికీ బీజేపీ అండగా ఉంటుంది. ప్రజలు ధైర్యంగా ఉండాలని కోరుతున్నా అని కిషన్ రెడ్డి అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news