సినిమా ఇండస్ట్రీలోకి చాలామంది నటీనటులు వస్తున్నారు. కొంతమంది వారసత్వాన్ని అందిపుచ్చుకొని వస్తుంటే… మరి కొంతమంది టాలెంటును చూపించుకునేందుకు రంగంలోకి దిగుతున్నారు. ఇందులో భాగంగానే తాజాగా గాలి జనార్దన్ రెడ్డి తనయుడు కిరీటి.. కూడా ఇండస్ట్రీలోకి వచ్చేసాడు. ఇందులో భాగంగానే.. జూనియర్ సినిమాతో మెరిశాడు.

గాలి జనార్ధన్ రెడ్డి తనయుడు కిరీటీ హీరోగా పరిచయం అవుతూ శ్రీలీల, జెనిలియా డిసౌజా హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘జూనియర్’ శుక్రవారం రిలీజ్ అయింది. ఈ సినిమాని చూసిన ప్రేక్షకులు SMలో తమ అభిప్రాయాలను షేర్ చేస్తున్నారు. కిరీటి నటన, డాన్స్, ఎనర్జీని అందరు మెచ్చుకుంటున్నారు. జెనిలియాకు మంచి కంబ్యాక్ అని పేర్కొంటున్నారు. ఇక మూవీ స్టోరీ రెగ్యులర్ టెంప్లెట్లో యావరేజ్‌గా ఉందంటున్నారు.