కుంకుమపువ్వు అత్యంత ఖరీదైన సుగంధ ద్రవ్యాలలో ఒకటి. చాలా మంది కుంకుమపువ్వు అంటే.. కేవలం గర్భిణులు మాత్రమే వాడతారు అనుకుంటారు. దీన్ని ఎవరైనా ఎప్పుడైనా వాడొచ్చు. అసలు ఇందులో ఉన్న ఔషధగుణాలు తెలిస్తే మీరే ఆశ్చర్యపోతారు. చాలా మంది భార్యభర్తలు సెక్స్ లైఫ్ బోరింగ్‌గా ఫీల్ అవుతారు. క్లైమాక్స్ నిరాశ కల్పించంది భార్యలు అసంతృప్తిగా ఉంటారు. కొందరు పురుషులకు ఎక్కువ స్టామినా ఉండదు. దాంతో బెడ్ మీద వాళ్ల ప్రతాపం చూపించలేరు. కుంకుమపువ్వుతో చేసిన టీ తాగితే మీ సెక్స్ లైఫ్ సూపర్‌గా ఉంటుందని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు.
కుంకుమపువ్వు టీని రాత్రి పడుకునే ముందు తీసుకుంటే ఎన్నో అద్భుతమైన ప్రయోజనాలు ఉన్నాయి. కుంకుమపువ్వు టీ లైంగిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. కుంకుమపువ్వు ఒక ప్రసిద్ధ, ఖరీదైన మసాలా. కానీ ఆయుర్వేదంలో కుంకుమపువ్వును కామోద్దీపనగా పరిగణిస్తారు. ఇది కార్టిసాల్ హార్మోన్ విడుదలను నియంత్రిస్తుంది, డిప్రెషన్‌ను తగ్గించడానికి పనిచేస్తుంది.
రోజూ కుంకుమపువ్వు టీ తాగడం వల్ల మీ మానసిక స్థితి మెరుగుపడుతుంది. లైంగిక కోరిక, శక్తిని పెంచుతుంది. సెక్స్ పట్ల ఆసక్తి కోల్పోయిన మహిళలు ప్రతిరోజూ 30 మిల్లీగ్రాముల కుంకుమపువ్వు తీసుకోవాలి. కుంకుమపువ్వు టీ తయారు చేసి త్రాగడం మంచి ఎంపిక. మీరు వరుసగా 60 రోజులు కుంకుమపువ్వు టీ తాగితే, మహిళల్లో సెక్స్ హార్మోన్ల విడుదలలో మెరుగుదల చూడవచ్చు. అంగస్తంభన సమస్య ఉన్న పురుషులు ప్రతిరోజూ 30 mg కుంకుమపువ్వును వారాలపాటు తీసుకోవాలి. అంగస్తంభన పనితీరు గణనీయంగా మెరుగుపడుతుంది.